14910290_366589963682965_4515676946335969857_n14910566_1839792212974453_9033760500675685884_n

 

మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో జరిగిన భూటకపు ఎన్ కౌంటర్ ఘటనకు నిరసనగా ధర్నా నిర్వహించిన sdpi..

ఈ ధర్నాలో sdpi ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు DS.habibulla గారు మాట్లాడుతూ ఈ ఎన్ కౌంటర్ కు బాధ్యత వహిస్తూ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలన్నారు. భోపాల్ లో జరిగిన ఎన్ కౌంటర్ పై పోలీసులు చెప్పిన కథనం పై అనేక లొసుగులు ఉన్నాయన్నారు. భోపాల్ ఎన్ కౌంటర్ నాటకం నకిలీగా కనిపిస్తూ ఉందన్నారు.ఎందుకంటే అండర్ ట్రయల్ ఉన్న సిమి కార్యకర్తలు త్వరలో విడుదల అయే అవకాశం ఉందన్నారు.సిమి కార్యకర్తలు ను ఉంచిన జైలుకు మూడు అంచెల భద్రత ఉండి కూడా జైలు రింగు చీల్చుకొని పొయారంటే చాల ఆశ్చర్యంగా ఉందన్నారు. వారు 20 నిమిషాల్లోనే జైలు నుండి పారిపోవడం మరియు ఏ జైలు అధికారి కూడా వారిని చూడకపోవడం విడ్దురంగా ఉందన్నారు.భోపాల్ లోని జైలుకు ఐ యస్ ఓ ధృవీకరించబడి ఉందన్నారు.అలాంటి జైలు నుండి వారు ఎలా తప్పించుకోగలిగారన్నారు. కాబట్టి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ నాయ్య వ్యవస్థ మరియు చట్టం ఉల్లంఘనకు నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేయాలన్నారు.కేవలం సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జి చే మాత్రమే పూర్తి స్థాయి దర్యాఫ్తు చేస్తే నాటకంలోని అన్ని శక్తులు బహిర్గతం అవుతాయన్నారు. మరణించినప్ఫుడు బ్రాండెడ్ బట్టలు. బూట్లు.గడియారలు ఎలా వచ్చాయన్నారు.బెడ్షీట్లు ఉపయోగించి 30 అడుగుల గోడ దూకడం భౌతికంగా అసాధ్యం అన్నారు ఇది ఒక సంపూర్ణ ప్రణాళికగా రచించిన నకిలీ ఎన్ కౌంటర్ అని చెప్పారు ఈ నకిలీ ఎన్ కౌంటర్ ను నిజం చేయడానికి అనవసరంగా ఒక పోలీస్ అధికారిని చంపబడ్డారన్నారు దేశంలో ఇకనైనా ఇలాంటి భూటకపు ఎన్ కౌంటర్లు ఆపాలని డిమాండ్ చేశారు. మరియు మైనారిటీ.దళితులపై వర్గాలపైనే ఎన్ కౌంటర్లు ఎందుకని ప్రశ్నించారు.